దూదేకుల జేఏసీతో మా సంఘానికి సంబంధం లేదు: షేక్ సత్తార్ సాహెబ్

విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులోని బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ప్రకటించిన దూదేకుల జేఏసీతో తెలంగాణ రాష్ట్ర నూర్ బాష్/దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సత్తార్ సాహెబ్ తెలిపారు. ఆ సమావేశానికి తమ సంఘం హాజరుకాలేదని, ఎలాంటి మద్దతు ప్రకటించలేదని చెప్పారు. సైదులు వ్యక్తిగతంగా మాత్రమే సమావేశానికి హాజరయ్యారని, సంఘం ప్రతినిధిగా పంపలేదని స్పష్టం చేశారు. తమది స్వతంత్ర సంఘమని, గత 60 సంవత్సరాలుగా దూదేకుల సమాజ హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ అనేక ప్రభుత్వ ఉత్తర్వులు సాధించామని పేర్కొన్నారు. దళిత ముస్లింలకు ఎస్సీ హోదా పునరుద్ధరణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sheikh-sattar-saheb-our-sangha-has-nothing-to-do-with/article-17379

Tags: