అదృశ్యమైన యువకుడు నీటిలో శవమై తేలాడు.

అదృశ్యమైన యువకుడు నీటిలో శవమై తేలాడు.

విశ్వంభర, శంషాబాద్ :- మండల పరిధిలోని  నానాజీపూర్ గ్రామానికి బంధువుల ఇంటికి వచ్చి అదృశ్యమైన బ్యాగరీ శ్రీచరణ్  నానాజీపూర్ చెరువులో  శవమై తేలాడు. శంషాబాద్ రూరల్ పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం  సంగారెడ్డి జిల్లా ఆర్సిపురం మండల్ ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన బ్యాగారి హనుమంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ మండల పరిధిలోని నానాజిపూర్ గ్రామనికి తేదీ: 09.05.2026 నాడు వారి బంధువుల ఇంట్లో గృహా ప్రవేశం ఉన్నందున నానాజిపూర్ గ్రామానికి వచ్చారు. అదే రోజు ఉదయం 11:30 గంటలకి వారి బంధువుల ఇంట్లో పూజ జరుగుతుండగా బ్యాగారి హనుమంత్ చిన్న కొడుకు అయిన బ్యాగారి శ్రీచరణ్ , వయస్సు 17 అతనిని కొబ్బరికాయలు తీసుకురమ్మని షాప్ కి పంపించగా, షాప్ కి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకువచ్చి ఇంట్లో ఇచ్చాడు. అతని తండ్రి హనుమంత్ వద్ద,  500/- రుపాయలు ఇవ్వమని అడగగా అతను నా వద్ద లేవు అని చెప్పగా, అదే సమయంలో మద్యాహ్నం 12:00 గంటలకి  బ్యాగారి శ్రీచరణ్ తన అన్న రాఘవేందర్ కి బహిర్భుమి కి వెళ్తున్నాను అని చెప్పి బైక్  (TS07GE1045) ను తీసుకొని వెళ్ళి పోయాడు. ఎంత సేపటికి బ్యాగారి శ్రీచరణ్ తిరిగి రాకపోవడంతో అతని యొక్క ఫోన్ నెంబర్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని వస్తున్నది అని. శ్రీచరణ్ గురించి వెతుకుతుండగా వారికి నానాజిపూర్ వాగు దగ్గర ఉన్న హనుమాన్ గుడి వద్ద అట్టి బైక్ కనిపించింది. తన కొడుకు గురించి చుట్టుప్రక్కల ప్రాంతాలలో మరియు వారి బంధువులను అడిగి తెలుసుకొనగా ఎక్కడ కూడా అతని  ఆచూకీ లభించలేదు. ఇట్టి విషయం పై 10.05.2026 నాడు  పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా,  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, నానాజిపూర్ గ్రామస్తుల నుండి డైల్ 100 కు ఫోన్ చేసి నానజిపూర్ వాగు లో ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి వాగులోని నీటి పై తెలియున్నాడు అని తెల్పగా, పోలీసులు అక్కడికి వెళ్ళి చూసేసరికి నిన్న తప్పిపోయిన  బ్యాగారి శ్రీచరణ్ అని గుర్తించారు. బ్యాగారి శ్రీచరణ్ బహిర్భుమి కి వెళ్తుండగా  ప్రమాదవశాత్తూ వాగులోని నీటి లో పడి చనిపోయినట్టుగా వున్నది, శ్రీచరణ్ శవాన్ని నీటిలో నుంచి బయటకు తీసి పంచనామా నిమిత్తం  ఉస్మానియా మోర్చ్యువరీ కి  తరలించి, ఇట్టి విషయం పై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-missing-youth-floated-dead-in-the-water/article-15285

Tags: