కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

విశ్వంభర, ముషీరాబాదు :  పరీక్ష పత్రాల లీకేజీ వివాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ (సిజేపీ) చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం నీట్ లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నాచౌక్లో సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంకు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, తెలంగాణ మాజీ విద్యా కమీషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్ చుక్ మాట్లాడుతూ సీజేపీ ఒక రాజకీయ వేదిక కాదని, దేశ యువతను ప్రోత్సహిస్తూ, ప్రతి భారతీయుడిని మేల్కొలిపి, సమాజానికి, సానుకూలంగా దోహదపడేలా చేయటమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు. విద్యారంగంలో పటిష్టమైన పునాదులు ఉండాలని, మన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ మాట్లాడుతూ లాల్బహుదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారీ రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆనాడు ఆయన తన పదవికి రాజీనామా చేశారని, నేడు పరీక్షా పత్రాల లీకేజీలతో విద్యార్థులు బలిఅవుతున్నా, కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీజేపీ స్పోక్స్ పర్సన్ విజేత దహియా, వామపక్ష నేతలు, సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, యాక్టివిస్టులు పాల్గొన్నారు.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/union-education-minister-dharmendra-pradhan-should-resign/article-16654

Tags: