మూడవ రోజు కొనసాగుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనలు
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని
మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు
విశ్వంభర న్యూస్ : - కేశంపేట సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రారంభమైన మధ్యాహ్న భోజన కార్మిక రిలే నిరాహార దీక్షలు. మూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని మేస్చార్జీలు ఇవ్వకపోవడం కోడిగుడ్డు బిల్లులు గత ఆరు నెలలుగా ఇవ్వకపోవడం కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని ప్రభుత్వంలోకి రాకముందు రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 10,000 వేతనాన్ని ఇస్తామని ప్రకటించిన సీఎం గారు ఆ దిశగా ఇప్పటివరకు జీవో జారీ చేయలేదని కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని గత ఆరు నెలలుగా పొండి పేద పిల్లలకి వడ్డిస్తే ఇప్పటివరకు జీతాలు ఇవ్వకపోవడం మేచాజీలు ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెల ఐదు తారీకు లోపు జీతాలను చెల్లిస్తుందని కానీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను విస్మరిస్తుందని ఆయన విమర్శించారు ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నేటి నుండి నాలుగు రోజుల వరకు కొనసాగుతాయని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మన్నా లాంటి స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని అప్పజెప్పే యోజనను విరమించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు గత 20 సంవత్సరాలుగా తమ జీవితాలను తాకట్టుపెట్టి పాఠశాలలో వండి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డు ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని అధికారులు మరియు ప్రజాప్రతినిధుల వేధింపులు ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం మెడలు వంచి వారి డిమాండ్లను సాధించుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు రాములు సత్తెమ్మ యాదమ్మ సబిత జంగమ్మ నిర్మల కైరున్ బాలమణి కళావతి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.