ప్రపంచ రక్తదాతల దినోత్సవం: హనుమకొండ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు
విశ్వంభర, హనుమకొండ: ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన రాష్ట్ర స్థాయి రక్తదాన అవార్డుల్లో హనుమకొండ జిల్లా సత్తా చాటింది. స్వచ్ఛంద రక్తదానం, రక్త సేకరణ, శిబిరాల నిర్వహణ, సామాజిక సేవల్లో విశిష్ట కృషికి జిల్లాకు మొత్తం 8 రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా. పి. విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఇ.వి. శ్రీనివాస్ రావు అవార్డులు అందుకున్నారు.హనుమకొండ రెడ్ క్రాస్ రక్తకేంద్రం “అత్యధిక రక్త సేకరణ చేసిన రక్తకేంద్రం” విభాగంలో రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. సంస్థల విభాగంలో ఎస్‌ఆర్ యూనివర్శిటీ, కిట్స్ వరంగల్, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు అవార్డులు లభించాయి. విశిష్ట సేవల విభాగంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్, డాఫొడిల్స్ స్కూల్ ఎంపిక కాగా, వ్యక్తిగత విభాగంలో జి. రామకృష్ణ, బి. శిరీష్ కుమార్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ “రక్తదానం మహాదానం, ప్రాణదానం” అని పేర్కొంటూ ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉన్న హనుమకొండ రెడ్ క్రాస్ రక్తకేంద్రాన్ని భవిష్యత్తులో ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.