దుబ్బాకలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, దుబ్బాక గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, భగత్ సింగ్ యూత్ దుబ్బాక ఆధ్వర్యంలో అక్షర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ  సహకారంతో ఆదివారం  ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని డాక్టర్ రాంబాబు, అనూష, గ్రామ సర్పంచ్ గట్టు నర్సింహ్మ, సిపియం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం ప్రారంభించారు. వైద్య శిబిరంలో బిపి, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషయన్లు, వైద్య సిబ్బంది వారి సేవలను అందించారు. డాక్టర్ రాంబాబు వారి తండ్రి ఙాపకార్థం గ్రామ ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, భగత్ సింగ్ యూత్ సభ్యులు నిర్విరామంగా వైద్యులకు, ప్రజలకు వాలింటర్లుగా సేవలందించారు. అనారోగ్య సమస్యలున్న వారికి ఉచిత మందులు పంపిణీ చేసారు. అనంతరం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు వైద్యులకు సన్మానం చేశారు. గ్రామంలోని మెడికల్ రిప్రజెంటేటివ్స్ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహాయంగా మందులు అందించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, మండల అధ్యక్ష, కార్యదర్శులు శానగొండ రాము, మెట్టు శ్రవణ్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, మాజీ సర్పంచ్ గుండాల నర్సింహా, శాఖ కార్యదర్శి గుండాల ప్రసాద్, టిఎస్.యుటిఎఫ్ మండల నాయకులు మేడి మధు బాబు, డివైఎఫ్ఐ గ్రామ నాయకులు కంబాలపల్లి మత్స్యగిరి, గుండాల అనిల్, గట్టు జ్యోతిబసు, దుబ్బాక గ్రామ పాలక వర్గం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, భగత్ సింగ్ యూత్ నాయకులు, గ్రామ పెద్దలు, యువతీ, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/free-medical-camp-under-bhagat-singh-youth-at-dubbaka/article-16628

Tags: