మహేశ్వరం మండలాన్ని పూర్తిగా ఫ్యూచర్ సిటీలో కలపాలి: జేఏసీ
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్ రఘుపతి, అధ్యక్షుడు కర్నాటి మనోహర్ మాట్లాడుతూ మహేశ్వరం మండలాన్ని కేవలం కొన్ని గ్రామాలకు పరిమితం చేయకుండా పూర్తిగా ఫ్యూచర్ సిటీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధి దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ఫ్యూచర్ సిటీకి అనుకూలంగా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలని సర్పంచ్‌లకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో చేర్చే వరకు ఉద్యమం ఆగదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, వర్కల యాదగిరి, ఎడమ మోహన్ రెడ్డి, కటికల శ్రీహరి, గదగూటి మహేందర్ ముదిరాజ్, సుభాష్, సుదర్శన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.