నేతన్నలను అభినందించిన న్యాయమూర్తులు
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో నిర్మించబోతున్న నూతన కోర్టు భవన నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.శ్యామ్ కోషి మండలంలోని బోగారం గ్రామంలోని చేనేత మగ్గం నేతలను సందర్శించారు. న్యాయమూర్తి స్వయంగా మగ్గం నేసారు, చేనేతల కళా ప్రావీణ్యాన్ని అభినందించారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ కె.శరత్, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయసేన రెడ్డి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ కె.సుజన, జస్టిస్ నర్సింగరావు నందికొండ, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.జయరాజు, రామన్నపేట కోర్టుల న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.



