ఆదరించండి అభివృద్ధి చేస్తా
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 26వ వార్డులో ప్రచారం జోరందుకుంది . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి భూక్య సోనియా సురేష్ నాయక్ వార్డు పరిధిలోని సిగ్నల్ కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే కాలనీలో ఉన్న సమస్యలన్నీ తక్కువ సమయంలోనే పూర్తిగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు . ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు , సీసీ కెమెరాలు, పిల్లలకు పార్కులు, జిమ్ము ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ ప్రచారంలో కౌన్సిలర్ అభ్యర్థి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ,అభిమానులు , కార్యకర్తలు , ఉన్నారు .



