ఘనంగా గద్దర్ జయంతి
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ 78వ జయంతి కార్యక్రమం వివిధ ప్రజా సంఘాల నాయకుల తో కలిసి ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ , భారతదేశంలో దోపిడీకి గురి అవుతున్న పీడిత శ్రామిక వర్గాల కోసం తన ఆట పాట గజ్జ గొంగళితో అనేక రాష్ట్రాలు తిరిగి రాజ్యాంగo లో ని హక్కుల కోసం , చట్టాల అమలు కోసం, దోపిడీ లేని సమాజం కోసం, వివక్షత లేని సమాజం కోసం, అణగారిన వర్గాల పక్షాన వేలాదిమంది యువతను చైతన్య పరిచిన గొప్ప శ్రామిక విప్లవ స్ఫూర్తి దాత గద్దర్ అని పేర్కొన్నారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వదిలేసి సమ సమాజ స్థాపన కోసం నవ సమాజ నిర్మాణం కోసం తన జీవితం త్యాగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ భూధ్య నాయక్ , సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకులు సామ పాపయ్య , పలువురు అభిమానులు పాల్గొన్నారు .



