ఆదిభట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బొంగ్లూర్ పరిధి సప్తగిరి కాలనీలోని ఒక ఇంటిలో అన్యమత ప్రచారం జరుగుతుందనే సమాచారంతో హిందూ వాహిని సంఘానికి చెందిన నేతలు అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న క్రిస్టియన్ పాస్టర్స్ కు హిందూ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఇరు వర్గాలు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు రాగా కేవలం హిందూ సంఘాల నేతలపై మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారని హిందూ వాహిని, బీజేపీ నేతలు మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిజెపి కంటెస్టైడ్ ఎమ్మెల్యే నోముల దయానంద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు కొత్త అశోక్ గౌడ్, బోసుపల్లి ప్రతాప్, జిల్లా నాయకులు రమేష్, ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి, వివిధ క్షేత్రాల నాయకులు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసారు.