ఘనంగా కుమ్మరుల తొలి బోనం జాతర

ఘనంగా కుమ్మరుల తొలి బోనం జాతర

 విశ్వంభర, ముషీరాబాదు : కుమ్మరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, గవర్నర్ కోటాలో శాసనమండలికి అవకాశం కల్పించడంతో పాటు కుమ్మరుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఉప్పల్ బగాయత్‌లో కుమ్మరులకు కేటాయించిన స్థలంలో ప్రభుత్వం భవనాన్ని నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడ జయంత్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాదు లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనం జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కుమ్మర సంఘం నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై కుమ్మర సమాజానికి ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తుందని, వారి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కుమ్మరుల సమస్యల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేయాలని, ప్రభుత్వం గుర్తించే విధంగా జన సమీకరణతో భారీ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కుమ్మరుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరగా, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ కుమ్మరుల హక్కుల సాధనకు సంఘటిత ఉద్యమమే విజయానికి మార్గమని అన్నారు. అనంతరం మహిళలు పెద్ద ఎత్తున సంప్రదాయ బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కవాడిగూడ కట్ట మైసమ్మ ఆలయం వరకు కొనసాగింది. భక్తిశ్రద్ధల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీలో సంప్రదాయ డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బోనాల కన్వీనర్ ఆడాల గణేష్, రాష్ట్ర కార్యదర్శి నాగపురి నాగేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్, రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం నరసింహ,నెల్లుట్లస్వామి దేవరుప్పల వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-07-16 at 11.16.40 PM

Read More జర్నలిస్టులకు ఆర్టీసీ బయాణం కల్పించాలి స్సులలో ఉచిత ప్ర

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-first-bonam-fair-of-potters/article-18721

Tags: