11వ వార్డులో ఉచిత కంటి పరీక్షల శిబిరం
- 56 మందికి కంటి పరీక్షలు.. ఏడుగురికి ఉచిత ఆపరేషన్లు
విశ్వంభర, హుస్నాబాద్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హుస్నాబాద్ పట్టణంలోని 11వ వార్డులో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో శరత్ మ్యాక్స్ విజన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 56 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. డాక్టర్ మోరే సందీప్ కుమార్, ఆప్తమాలజిస్ట్ అనూష, సీహెచ్‌డబ్ల్యూ సదానందం ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా, శస్త్రచికిత్స అవసరమైన ఏడుగురికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపడతామని వైద్య బృందం తెలిపింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ, కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కమిషనర్ టి. మల్లికార్జున్, కౌన్సిలర్లు చెన్నబోయిన అనూష, బూరుగు లత, కొండ రజిత, పిల్లి తిరుపతి, బొలిశెట్టి రాజు, కేశవేణి రమేష్, బొల్లి శ్రీనివాస్, వైద్యం కిరణ్, గాదెపాక రవీందర్, బత్తుల స్వరూప, గోపగోని శోభన్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ హసన్‌తో పాటు శరత్ మ్యాక్స్ విజన్ అసిస్టెంట్ మేనేజర్ ముసిపట్ల సాగర్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.