గుండాల కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొడపర్తి భాస్కర్

విశ్వంభర, గుండాల: గుండాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి నిర్వహించిన సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొడపర్తి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అన్యపర్తి ప్రమోషన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్త, జిల్లా నాయకులు ఏలూరి రాంరెడ్డి, మెడిశెట్టి వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన నాయకులకు సూచించారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని నూతనంగా ఎన్నికైన నాయకులకు అభినందనలు తెలిపారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kodaparthi-bhaskar-as-president-of-gundala-congress-village-branch/article-18805

Tags: