భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జగన్నాథ రథయాత్ర
విశ్వంభర, చిక్కడపల్లి : జగన్నాథుని రథాన్ని భక్తితో లాగడం మహా పుణ్యఫలాన్ని అందిస్తుందనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గురువారం ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. ఇస్కాన్ అబిడ్స్ ఆధ్వర్యంలో హైదరాబాదు ఎన్‌టీఆర్ స్టేడియం (ఇందిరాపార్కు సమీపం) నుంచి శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించిన రథంపై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు "హరే కృష్ణ" నామస్మరణతో రథాన్ని తాళ్లతో లాగుతూ స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. హరినామ సంకీర్తనలు, భజనలు, కీర్తనలు, నృత్య ప్రదర్శనలతో నగరం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. రథయాత్ర ఇందిరాపార్కు చౌరస్తా, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్, బీజేఆర్ సర్కిల్, గన్‌ఫౌండ్రీ, చెర్మాస్, తాజ్‌మహల్ హోటల్ జంక్షన్, బాటా జంక్షన్, జీపీఓ సర్కిల్, ఎంజే మార్కెట్, మలక్‌పేట్ మార్గాల మీదుగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కొనసాగింది. మార్గమంతా భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి పుష్పవర్షం కురిపించారు. పలుచోట్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసి తీర్థప్రసాదం, మహాప్రసాదం, తాగునీరు పంపిణీ చేశారు. యాత్రలో భజన బృందాల ఆధ్యాత్మిక గానాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు సహా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక హారతి, మహాప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాదులో ఇస్కాన్ ఆధ్వర్యంలో నాలుగు దశాబ్దాలకు పైగా నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటిగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.