బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు

  •  -ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : చైర్మన్ బూడిద రాంరెడ్డి

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: సమాజ సేవే మహోన్నత ఆశయంగా, “ఆరోగ్యమే మహభాగ్యం- మీ ఆరోగ్యం మా బాధ్యత" అనే లక్ష్యంతో (సాయి కీర్తన్ రెడ్డి లెగసీ ట్రస్ట్ నిర్వహణలో) బి.ఆర్.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన పయనీర్ హాస్పిటల్స్, రష్ కేర్  హాస్పిటల్ సాధూరామ్ కంటి హాస్పిటల్స్ అనుభవజ్ఞులైన నిపుణులైన వైద్యుల సహకారంతో ఈ శిబిరాలు జరగనున్నాయి. ఈ మెగా క్యాంపులలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు, మహిళల ప్రత్యేక సమస్యలు, పిల్లల వైద్యం, కీళ్ల నొప్పులు (ఆర్థోపెడిక్), నేత్ర పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నారు. అలాగే శిబిరంలో భాగంగా రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు క్రింది ప్రాంతాలలో నిర్వహించబడుతాయి.జూలై 18న ఇబ్రహీంపట్నంలోని భారత్ గార్డెన్, యాచారం గ్రామపంచా యతీ ఆవరణలలో సమాంతరంగా శిబిరాలు జరుగుతాయి. జూలై 19న తుర్కయాంజాల్ లోని రొక్కం సత్తి రెడ్డి గార్డెన్స్, అబ్దుల్లాపూర్ మెట్ లో వై.ఎన్.ఆర్. గార్డెన్ లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని  ప్రజలకు పిలుపునిచ్చారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/free-mega-medical-camps-under-brr-foundation/article-18731

Tags: