రమణమూర్తిపై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు

  • నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి: హిందూ ఆధ్యాత్మికవేత్త, జై భారత్ వ్యవస్థాపకుడు రమణమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కెవిపిఎస్, టీపీఎస్కే ఆధ్వర్యంలో సామాజిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీపీఎస్కే రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జి. రాములు అధ్యక్షత వహించగా, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ తనపై జరిగిన దాడి వ్యక్తిగతంగా తనపై జరిగినది కాదని, హిందూ సమాజంపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన కశ్యప్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం మానుకోవాలని, ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, టీవీ చర్చ సందర్భంగా జరిగిన దాడి ఘటనపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉండగా మూడు రోజులు గడిచినా నిందితుడిని అరెస్టు చేయకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, భిన్నాభిప్రాయాలను హింసతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో రమణమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నిందితుడు కశ్యప్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే రచయితలు, పాత్రికేయులు, కళాకారులు, మేధావులపై దాడులను అరికట్టాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. జూలై 18న ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్వహించే రాష్ట్రవ్యాప్త శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర స్వామీజీ, ప్రజా వాగ్గేయకారుడు మాస్టర్ జీ, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెంకటదాసు, గుత్తా జ్యోత్స్న, పి.ఎన్. మూర్తి, అరుణ జ్యోతి, వంగూరి రాములు, కోట రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/public-organizations-have-condemned-the-attack-on-ramanamurthy/article-18773

Tags: