ల్యాండ్ చీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్

  • .. రిమాండ్‌కు తరలింపు

విశ్వంభర, సూర్యాపేట: ఇతరులకు చెందిన భూమిని తనదిగా చూపించి ప్లాట్ల పేరుతో భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ జి. రాజశేఖర్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, అయిలాపురం గ్రామ శివారులో ఉన్న భూమిని ప్లాట్లుగా విక్రయిస్తానని నమ్మబలికిన కాసర్ల సురేందర్ రెడ్డి, కోడదల వెంకన్న, కోడదల కనకయ్యల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడు. అయితే అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితుడు కోడదల వెంకన్న చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చివ్వెంల ఎస్‌ఐ మహేశ్వర్, సంబంధిత భూమి కాసర్ల సురేందర్ రెడ్డికి చెందినది కాదని గుర్తించారు. ఇతరులకు చెందిన భూమిని తనదిగా చూపిస్తూ బాధితులతో పాటు మరికొందరిని కూడా మోసం చేసినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు నిందితుడు కాసర్ల సురేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. నిందితుడు వ్యవస్థీకృతంగా భూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి మోసాలకు గురైన ఇతర బాధితులు కూడా పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు. భూముల కొనుగోలు, విక్రయాల సమయంలో సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, యాజమాన్య హక్కులను రెవెన్యూ అధికారుల ద్వారా ధృవీకరించుకున్న అనంతరమే లావాదేవీలు నిర్వహించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/accused-arrested-in-land-cheating-case/article-18777

Tags: