వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతికి సంతాపం  

వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతికి సంతాపం  

  • టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ 

విశ్వంభర, మహబూబాబాద్ : టీఎన్జీవోస్ నేత వల్లపు రెడ్డి రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో పలువురు సంతాపం తెలిపారు .
ఈ సందర్భంగా  టి ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, వల్లపు రెడ్డి రాజిరెడ్డి  రెవెన్యూ శాఖలో మహబూబాబాద్ ప్రాంతంలో  సుదీర్ఘకాలంగా పనిచేశారని , ఎవరితో ఎలాంటి మాట పడకుండా మంచి పేరు తెచ్చుకున్నారని , వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతి బాధాకరం అని అన్నారు. ఆయన మంచి మృదు  స్వభావి గల వ్యక్తి అని , అందరికీ సుపరిచితుడని , ఈయన మృతి అందరికీ చాలా  బాధాకరమని, అంతేకాకుండా  ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హనుమకొండలోని తన నివాసంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన అన్నారు . సంతాపం తెలిపిన వారిలో తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగు రమేష్ , విశ్రాంత గ్రామ పంచాయతీల ఈవోల సంఘం నాయకులు చింతల రాజయ్య , మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు రామంచ సుధాకర్, ఆకుల కిషోర్ కుమార్, మాధారపు కిరణ్ ,లు తదితరులు ఉన్నారు .

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/condolences-on-death-of-vallapu-reddy-rajireddy/article-18741

Tags: