సహకార సంఘాల  రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

విశ్వంభర, పరిగి: పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  కార్యాలయంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో పరిగి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు సుమారు రూ.45 లక్షల 60 వేల విలువైన గోల్డ్ లోన్ ఎల్ టి లోన్ రుణ చెక్కులను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్  డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  ఆధ్వర్యంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ డ్రోన్ సేవలను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని, డ్రోన్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు అవసరమైన సమయంలో సులభంగా రుణాలు అందించడం ద్వారా వారి వ్యవసాయ కార్యకలాపాలకు ఆర్థికంగా బలాన్నిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.సహకార సంఘాల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, వైస్ చైర్మన్ రాజ పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ హనుమంతు,  పిఎసిఎస్ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, రవి కాంత్ రెడ్డి, వెంకటేష్, నాగవర్ధన్, కౌన్సిలర్లు ఆరిఫ్, యూసుఫ్,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-rammohan-reddy-should-utilize-the-loans-of-cooperative-societies/article-18729

Tags: