ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేరాలి: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

విశ్వంభర, పరిగి: దోమ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దోమ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 117 మంది లబ్ధిదారులకు 1కోటి 17లక్షల 13వేల 572రూపాయల విలువైన కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిగి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అనేక కొత్త పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మండలంలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గత ఏడాది పరిగి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఈ ఏడాది మరో 2,500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు మెరుగైన గృహ వసతి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.  కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోందని, ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల సన్నబియ్యం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి రైతుకు రైతు భరోసా కింద రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా  ప్రయోజనం చేకూరుతోందని, ఇందిరమ్మ జీవిత బీమా పథకం  కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని  వివరించారు.ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాంతు కుమార్, ఎంపీడీవో గ్యామా, ఎంఈఓ వెంకట్, దోమ సర్పంచ్ శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, అంతిరెడ్డి, రాములు నాయక్ , అశోక్ రెడ్డి,అయినా పూర్ సర్పంచ్ రజిత భాస్కర్ గౌడ్,  లబ్ధిదారులు,  తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-rammohan-reddy-said-that-government-welfare-benefits-should-reach/article-18771

Tags: