పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ను తిరిగి పార్టీ లోకి ఆహ్వానించిన మహేష్ కుమార్ గౌడ్

విశ్వంభర, హైదరాబాద్: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండల అధ్యక్ష పదవి నుండి , కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయినా ఏ మాత్రం బెదరక, ఇతర పార్టీలో చేరక, ఇండిపిండెంట్ గా స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటి సర్పంచ్ గా గెలుపొందాడు. అందులో భాగంగానే నేడు గాంధీ భవన్ లో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డితో కలిసి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు.ఈ సందర్బంగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పై  సస్పెన్షన్ ఎత్తివేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చి, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  ఆహ్వానించారు. పెద్ది కృష్ణమూర్తి మాట్లాడుతూ,  నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, నాపై నమ్మకం పెట్టి సర్పంచిగా గెలిపించిన గ్రామ ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరి అభిమానాన్ని పొంది ఎల్లకాలం ఇదే ప్రేమను నిలబెట్టుకుంటానని తెలిపారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mahesh-kumar-goud-invited-peddi-krishnamurthy-goud-back-into-the/article-18785

Tags: