ఎల్ నినో పరిస్థితుల్లో ఆరుతడి, కూరగాయల పంటల సాగు మేలు

విశ్వంభర, మహబూబాబాద్: గురువారం జిల్లా కలెక్టరేట్ లోని  ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి పంటలు, కూరగాయ పంటలు సాగు చేయాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, ఆయిల్ పామ్ తోటల్లో, పండ్ల తోటల్లో అంతర పంటలు గా, ఎత్తు మడులు, పందిరి సాగు, ట్రెల్లిస్ సాగు, మల్చింగ్, బిందు సేద్య,సేంద్రీయ, ప్రకృతి సేద్యం మొదలైన మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలిపినారు. రైతులు పంట మార్పిడి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఉద్యాన అధికారులు శాంతి ప్రియ, శాంతి ప్రియదర్శిని, ఫీల్డ్ అధికారి శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది జ్యోస్న, కిషోర్, కరుణాకర్,రామకృష్ణ, సుమతి,అరుణ, సుకన్య, రైతులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cultivation-of-dry-season-vegetable-crops-is-good-under-el/article-18791

Tags: