కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల నుంచి బిజెపిలో చేరిక

విశ్వంభర, నెల్లికుదురు: భారతీయ జనతా పార్టీలోకి నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల కు చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నుంచి గురువారం భారీగా చేరారు. వీరికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు,మాజీ ఎంపీ సీతారాం నాయక,జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్ యాదవ్ ప్రభృతులు బిజెపి కండువా కప్పి ఆహ్వానించారు. నరసింహుల గూడెం లో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీ జల్లి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు బిజెపిలో చిరగా వీరి వెంట నవీన్ బాలకృష్ణ లు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి అవినీతి రహిత పాలన, అభివృద్ధి, దార్శనికత చూసి అన్నిచోట్ల బిజెపిలో అనేక మంది చేరుతున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో కళ్యాణ్ నాయక్, మదన్ లాల్,నల్లాని పాపారావు,పర్నె ప్రభాకర్ రెడ్డి, యాకిరెడ్డి,ముస్తఫా,తోట రమేష్,దుస్స యాకయ్య,తదితర నాయకులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/joined-bjp-from-congress-brs-parties/article-18719

Tags: