ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫారాలు, పౌష్టికాహారం వెంటనే అందించాలి

విశ్వంభర, రామన్నపేట: పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫారాలు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇస్కిల్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, అవసరమైన సామగ్రిని సకాలంలో అందించాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన పౌష్టికాహారం, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, పాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని కోరుతూ, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, వ్యకాస నాయకులు బల్గురి అంజయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి, మాజీ సర్పంచ్ గన్నేబోయిన విజయభాస్కర్, సీఐటీయు మండల కార్యదర్శి గొరిగే సోములు, నాయకులు గంటెపాక శివ కుమార్, మేడబోయిన శ్రీనివాస్, నీల ఐలయ్య, అప్పం సురేందర్, పల్లె సత్యం తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/uniforms-and-nutritious-food-should-be-provided-immediately-in-government/article-18783

Tags: