చేనేత అభివృద్ధికి అండగా నిలుస్తాం:  మబ్బు మహేష్ 

విశ్వంభర, గుండాల: గుండాల మండలంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్న మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ గురువారం మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండాల మండల చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు చిందం ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ అధ్యక్షుడు దుడుక ఉప్పలయ్యను కూడా కలిసి శాలువాతో సన్మానించి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా మబ్బు మహేష్ మాట్లాడుతూ, చేనేత రంగం అభివృద్ధి చెందాలని, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆకాంక్షించారు. నూతన అధ్యక్షుడు చిందం ప్రకాష్ నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, చేనేత సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lets-stand-by-the-handloom-development-%C2%A0mabbu-mahesh/article-18747

Tags: