స్లేట్స్ , నోట్ బుక్స్ వితరణ అభినందనీయం
- ఎమ్మెల్సీ రవీందర్రావు
విశ్వంభర, ఇనుగుర్తి: మండలం లోని లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల బాలబాలికలకు మాజీ వార్డు సభ్యులు చిర్రగోని కిరణ్ గౌడ్, స్రవంతి దంపతులు స్లేట్స్, నోట్ బుక్స్ తదితర మెటీరియల్ వితరణ చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు అన్నారు. పాఠశాల హెచ్ఎం చైతన్య అధ్యక్షతన గురువారం జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ హాజరై విద్యార్థినీ విద్యార్థులకు సంబంధిత మెటీరియల్ ను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం కిరణ్ గౌడ్ ప్రస్తుత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నదని, ఐదు తరగతులకు ఇద్దరు టీచర్స్ ఉన్నారని,ఒకే గది ఉందని,స్లాబ్ పెచ్చులు రాలుతున్నాయని, వర్షాకాలంలో వర్షపు నీరు కురుస్తుందని, ప్రహరీ గోడ సైతం లేకపోవడంతో పాఠశాలకు పాములు వస్తున్నాయని కొత్త బిల్డింగులు సాంక్షన్ చేయించాలని ఎమ్మెల్సీ కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బద్రు, పంచాయతీ కార్యదర్శి మణిదీప్,మాజీ సర్పంచి నారాయణరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.