స్వర్ణ పతక విజేత నారిమల్ల ప్రవళికకు ఘన సన్మానం

  • జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు యేకుల అనిత సురేష్ అభినందనలు

విశ్వంభర, డిండి: చైనాలోని ఒర్దోస్ నగరంలో ఇటీవల నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026లో 4×400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించి భారత దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తీసుకొచ్చిన యువ అథ్లెట్ నారిమల్ల ప్రవళికను నల్గొండ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు యేకుల అనిత సురేష్ ఘనంగా సన్మానించారు. ప్రవళిక విజయం గురించి తెలుసుకున్న అనంతరం యేకుల అనిత సురేష్ నేరుగా డిండి మండలంలోని గురుకుల పాఠశాలకు వెళ్లి ఆమెను కలుసుకున్నారు. శాలువాతో సత్కరించి, స్వీట్లు పంచుతూ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడేలా చేసిన ప్రవళిక సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యేకుల అనిత సురేష్ మాట్లాడుతూ, అత్యంత నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రవళిక అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. నారిమల్ల రాంబాబు, విజయల కుమార్తెగా జన్మించిన ప్రవళిక తన కృషి, పట్టుదలతో దేశానికి పేరు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రవళికను ఆదర్శంగా తీసుకుని గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత క్రీడల్లో రాణించాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై కూడా స్వర్ణ పతకాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రవళికకు శిక్షణ అందించిన కోచ్ పరశురామ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శిరీష, అలాగే ఆమె తల్లిదండ్రులు నారిమల్ల రాంబాబు, విజయలను యేకుల అనిత సురేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర వెంకటయ్య, అవుట మల్లేష్, అవుట అంకల్ తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-great-honor-for-gold-medalist-narimalla-pravlika/article-18711

Tags: