ఆస్తి కోసం అత్తను హత్య చేసిన కోడలు.. సహజ మరణంగా చిత్రీకరించిన కేసు ఛేదించిన తుంగతుర్తి పోలీసులు
- - నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు
- - సెల్‌ఫోన్ స్వాధీనం
- - కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో సంచలనం సృష్టించిన కొణతం భాగ్యమ్మ హత్య కేసును తుంగతుర్తి పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం అత్తను హత్య చేసి, దానిని సహజ మరణంగా చిత్రీకరించిన కోడలు కొణతం మధురను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను బుధవారం సూర్యాపేట పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగూడెం గ్రామానికి చెందిన కొణతం భాగ్యమ్మ ఈ ఏడాది ఏప్రిల్ 28న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఉప్పు శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగతుర్తి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మృతురాలి కోడలు కొణతం మధురే హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఆస్తి వివాదమే హత్యకు కారణం
మృతురాలు భాగ్యమ్మ పేరిట తూర్పుగూడెం గ్రామంలో సుమారు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో తనకు వాటా ఇవ్వాలని భాగ్యమ్మ కుమార్తె శోభారాణి తుంగతుర్తి కోర్టులో కేసు దాఖలు చేసింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 26న నిందితురాలు ఇంట్లో లేని సమయంలో శోభారాణి తన తల్లిని కలిసి భూమి వాటా విషయమై మాట్లాడి వెళ్లింది. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన నిందితురాలు మధురతో భాగ్యమ్మ తన కుమార్తెకు కనీసం రెండు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
కోపంతో అత్తను నెట్టివేసి హత్య
ఏప్రిల్ 27 రాత్రి ఇంట్లో అత్తా, కోడలు మాత్రమే ఉన్న సమయంలో ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో నిందితురాలు మధుర భాగ్యమ్మను బలంగా నేలపైకి నెట్టివేయగా ఆమె కిందపడిపోయింది. అనంతరం మళ్లీ లేచేందుకు ప్రయత్నించిన భాగ్యమ్మను వెనుక నుంచి చేతులతో బలంగా తోసి మంచంపై పడవేసింది. తీవ్ర గాయాల కారణంగా కొద్దిసేపటికే భాగ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు.
సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం
హత్య అనంతరం భాగ్యమ్మ మంచం మీద నుంచి కిందపడి మృతి చెందిందని బంధువులకు ఫోన్ చేసి నిందితురాలు నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అంత్యక్రియల సమయంలో మృతదేహానికి స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలు కనిపించడంతో మృతురాలి కుమార్తె శోభారాణి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేసి హత్య జరిగినట్లు నిర్ధారించారు.
నిందితురాలి అరెస్ట్
ఈ కేసులో నిందితురాలు కొణతం మధుర (50), భర్త శ్రీనివాసరావు (మరణించారు), వృత్తి వ్యవసాయం, నివాసం తూర్పుగూడెం గ్రామం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఆమెను జూలై 15, 2026న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. నిందితురాలి వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో తుంగతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. ఉపేందర్‌రావు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.