పోలీస్ డ్యూటీ మీట్‌లో రెండు పతకాలు సాధించిన కానిస్టేబుల్ రామయ్యకు ఎస్పీ అభినందనలు

విశ్వంభర, మహబూబాబాద్: ఇటీవల మామునూరులో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్‌లో రెండు పతకాలు సాధించి ప్రతిభ చాటిన మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ కానిస్టేబుల్ బాదె రామయ్యను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందించారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో బాంబ్ స్క్వాడ్ యాంటీ సబోటేజ్ చెక్ (రూమ్ సెర్చ్) విభాగంలో స్వర్ణ పతకం, బాంబ్ స్క్వాడ్ యాంటీ సబోటేజ్ చెక్ (వెహికల్ సెర్చ్) విభాగంలో కాంస్య పతకాన్ని రామయ్య కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కానిస్టేబుల్ రామయ్యను అభినందించిన ఆయన, భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ మరిన్ని పతకాలు సాధించి మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఇదే కృషి, అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. బాంబ్ స్క్వాడ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రామయ్య సాధించిన విజయంపై ఆయన స్వగ్రామమైన కురవి మండల కేంద్రంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. గ్రామ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, వివిధ వర్గాల ప్రజలు ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిరాశ చెందకుండా పట్టుదల, కృషితో పోలీస్ శాఖలో చేరిన రామయ్య నేడు తన ప్రతిభతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు పేర్కొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sp-congratulates-constable-ramaiah-for-winning-two-medals-in-police/article-18765

Tags: