ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
విశ్వంభర, మిర్యాలగూడ: ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా, చైతన్యవంతంగా వ్యవహరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణ గ్రంథాలయంలో ప్రోగ్రెసివ్ ఫోరం–జన విజ్ఞాన వేదిక, మరో గ్రంథాలయ ఉద్యమం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర", "ఓటర్ల జాబితా సవరణలో ఎదురయ్యే సవాళ్లు" అంశాలపై ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు తప్పనిసరిగా నమోదు కావాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని బలమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి తోడ్పడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మహ్మద్ రియాజ్, సామాజిక విశ్లేషకుడు, విద్యావేత్త రమేష్ పట్నాయక్ ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర, ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితా సవరణలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా వివరించారు. ఈ సదస్సులో ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, గ్రంథాలయ ఉద్యమకారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.