మిత్రుడి కుటుంబానికి రూ.14,500 ఆర్థికసాయం

విశ్వంభర,  హుస్నాబాద్ :స్నేహం అంటే సంతోషంలోనే కాదు, కష్టకాలంలోనూ అండగా నిలవడమేనని హుస్నాబాద్ జడ్పీ హైస్కూల్ 2003–04 పదో తరగతి మిత్రబృందం చాటిచెప్పింది. అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన లింగాల బాబు తండ్రి లింగాల గట్టయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, మిత్రబృందం వారి కుటుంబాన్ని పరామర్శించింది. అనంతరం లింగాల బాబు కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.14,500 నగదు ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన మిత్రులు, అవసర సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండటమే నిజమైన స్నేహమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ జడ్పీ హైస్కూల్ 2003–04 పదో తరగతి మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-of-rs-14500-to-a-friends-family/article-18755

Tags: