రాగన్నగూడ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన ఎలిమినేటి నరసింహారెడ్డి 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: తుర్కయంజాల్ బిజెపి మున్సిపల్ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి గురువారం రాగన్నగూడ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆటస్థలం వంటి మౌలిక వసతుల గురించి వివరాలు సేకరించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం మున్సిపాలిటీ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు కృషి చేస్తామని ఉపాధ్యాయులు, విద్యార్థులకు హామీ ఇచ్చారు. త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/eliminator-narasimha-reddy-visited-ragannaguda-zilla-parishad-school/article-18723

Tags: