ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని  ఏబీవీపీ నిరసన

విశ్వంభర,  హుస్నాబాద్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి రక్తవర్ణం తో అభిషేకం చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. "మా రక్తం కూడా ఇస్తున్నాం... మా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి" అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మెదక్ విభాగ్ కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక, చదువులు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల హక్కులేనని, అవి ప్రభుత్వం ఇచ్చే దానం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ కన్వీనర్ రాజేష్, నగర ఉపాధ్యక్షుడు సంతోష్, అంజి, నగర సంయుక్త కార్యదర్శి రంజిత్‌తో పాటు ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/abvp-protest-to-release-fee-reimbursement/article-18725

Tags: