సంస్కృతి కాలేజ్ అధ్యాపకురాలికి జాతీయ గుర్తింపు
విశ్వంభర, బోడుప్పల్: సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. మునిజా కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫార్మసీ విద్యా రంగంలో ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గాను అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియాఉమెన్స్ ఫోరం లో మెంబర్షిప్ సెల్ సభ్యురాలిగా ఆమెను నామినేట్ చేశారు. ఇక వివరాల్లోకెళ్తే బోడుప్పల్ నివాసి ఒక సామాన్య కుటుంబానికి చెందిన డాక్టర్. మునిజ ఈరోజు ఏపీటిఐ ఉమెన్స్ ఫోరంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా నిలవడం ఎంతో గర్వకారణం. మహిళలకు స్ఫూర్తిగా నాయకత్వం వహిస్తున్న మునిజకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఫార్మసీ విద్యా రంగంలో మహిళా అధ్యాపకుల నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో APTI ఉమెన్స్ ఫోరం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ జాతీయ స్థాయి సంస్థలో బాధ్యత దక్కడం డా. మునిజా విద్యా ప్రతిభకు, పరిశోధనా నైపుణ్యానికి నిదర్శనమని కాలేజ్ యాజమాన్యం పేర్కొంది.ఈ సందర్భంగా సంస్కృతి కాలేజ్ యాజమాన్యం, సహచర అధ్యాపకులు, విద్యార్థులు డా. మునిజాకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఫార్మసీ విద్యా వ్యవస్థ పురోగతికి, మహిళా అధ్యాపకుల వృద్ధికి ఆమె మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.