టూ వీలర్‌పై ఓ బైకర్ వివాదాస్పద రాతలు 

టూ వీలర్‌పై ఓ బైకర్ వివాదాస్పద రాతలు 

  • - పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు
  • - చర్యలు తీసుకోవాలని సీపీ రష్మికి పలువురి విన్నపం 

విశ్వంభర, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ బైకర్ తన టూ వీలర్ వాహనంపై వివాదాస్పద పెయింటింగ్ రాయించుకుని గత కొద్దిరోజులుగా హల్‌చల్ చేస్తున్నాడు. బైక్ వెనకభాగంలో డోంట్ ఆస్క్ మై బైక్, ఐ ఆస్క్ యూవర్ వైఫ్ అని వెగటు పుట్టించేలా కోటేషన్ వేయించుకున్నాడు. నా బైక్‌ను అడిగితే.. నేను నీ భార్యను అడుగుతా అనే అర్థమచ్చేలా ఉన్న కోటేషన్‌పై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీఎస్08, జీపీ 5929 అనే నెంబర్ ప్లేట్‌తో ఉన్న ఈ బైక్ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ఎదుట గురువారం కనిపించింది. చీటికిమాటికి డ్రంకెన్ డ్రైవ్ చేపట్టే పోలీసులు, రోడ్డు సేఫ్టీ గురించి తరుచూ వివరించే ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. పెయింటర్స్ కూడా డబ్బులకు కకృతి పడుతూ వివాదాస్పదమైన కోటేషన్స్ రాయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇష్టారీతిగా కోటేషన్స్ రాయకుండా పెయింటర్స్‌కు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. సీపీ రష్మి బైకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/controversial-writings-of-a-biker-on-two-wheeler/article-18759

Tags: