ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ వాటర్ ప్లాంట్ ను సందర్శించిన సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్, టెక్నాలజీ, భారత ప్రభుత్వం నిర్మించిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ వాటర్ ప్లాంట్ ను గురువారం యాదాద్రి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి, సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు సందర్శించారు. చేనేత రంగులు అద్ధకం నీరు, డ్రైనేజీ మురికి నీటిని శుద్ధి చేసి రోజు వారి వాడుక కొరకు నిర్మాణం చేసిన ఫిల్టర్ ప్లాంట్ యొక్క టెక్నాలజీ వివరాలు తెలుసుకుని త్వరలో గ్రామ పంచాయతీకి అప్పగింత పనుల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ ఎం.అనూష రమేష్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మినర్సు, వార్డు సభ్యులు, అధికార్లు, మండల ఎంపీడిఓ ఏ.రాములు, డివిజన్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్, చేనేత సొసైటీ ఉపాధ్యక్షులు, సభ్యులు హాజరవడం జరిగింది.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/csir-scientists-visited-the-effluent-treatment-water-plant/article-18803

Tags: