ప్రజలతో మమేకం కండి.. రాష్ట్రంలో విజయం బిజెపిదే..

  • మోడీకి పేరొస్తుందనే పథకాలను అడ్డుకుంటున్నారు       
  • బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు

 విశ్వంభర, నెల్లికుదురు: ప్రజా సమస్యలపై గళమెత్తుతూ నిరంతరం జనంతో మమేకమైతే రాష్ట్రంలో బిజెపి విజయదుందుభి మోగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమరు కొమ్ముల గౌతం రావు అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులోని అమూల్య గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ పతాకా విష్కరణ చేశారు. పార్టీ నాయకులు సింగారం సతీష్,వద్దిరాజు రామచంద్రరావు,పొదిల నరసింహారెడ్డి,చిలుపూరి వెంకన్న,గడ్డం అశోక్,నల్లాని పాపారావు,లింగాల సుధీర్ రెడ్డి,ఇందు భారతి,మదన్ లాల్ ప్రభృతులలో కొందరు రాజకీయ తీర్మానాలు చేయగా కొందరు సమర్థించారు. అనంతరం గౌతమ్ రావు జిల్లాలోని 16 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులను పార్టీ పూర్వ అభివృద్ధిపై అడిగి తెలుసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ అర్హులకు చెందేలా చూడాలన్నారు.పార్టీ ఆజ్ఞాపించిన విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ తూచా తప్పకుండా అమలు చేయాలంటూ కార్యవర్గ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.మోడీ పథకాలపై గౌతం రావు మాట్లాడుతూ రైతాంగ పంటల నష్టానికి పసల్ బీమా, అర్హులందరికీ ఇండ్లు నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రజారోగ్యానికి ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అమలు చేస్తే మోడీకి పేరు వచ్చి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని కుట్రతో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. అవినీతి బంధుప్రీతి కలిగిన ఆ రెండు పార్టీలు త్వరలోనే అంతరిస్తాయన్నారు.బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడని కవిత ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ దోచుకుందని చెప్పడం విడ్డూరమని, అప్పుడు భాగస్వామిగా ఉండి నోరెందుకు మెదపలేదన్నారు. బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే అధికారంలోకి వచ్చిన బిజెపి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల్లో బిజెపి జయకేతనం ఎగురవేయాలన్నారు. అంతకుముందు మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ తో పాటు అభివృద్ధి పనులు చేస్తూనే తాజాగా రూ.531 కోట్లతో మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు కళ్యాణ్ నాయక్, మహేష్ గౌడ్, చందు రాజ్ కుమార్ యాదవ్,పర్నె ప్రభాకర్ రెడ్డి,హిందుభారతి,డా.అశోక్, మని చందన,రాసయాకిరెడ్డి,బాదావత్ సురేష్ నాయక్, దుంపల సందీప్,తోట రమేష్, ముస్తఫా, జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-is-winning-in-the-state-by-connecting-with-the/article-18795

Tags: