కొంగరకలాన్‌లో తాటి చెట్ల కూల్చివేత

కొంగరకలాన్‌లో తాటి చెట్ల కూల్చివేత

విశ్వంభర, ఇబ్రహీంపట్నం:  రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరకలాన్ , ఫిరోజ్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 85, 86, 87/పి  లో వెంచర్ నిర్మాణం కోసం తాటి చెట్లను అక్రమంగా కూల్చివేశారని గీత కార్మిక సంఘం అధ్యక్షుడు నీళ్ల సురేశ్ గౌడ్ ఆరోపించారు. గౌడ సొసైటీకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చెట్లను తొలగించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాటి చెట్లే గీత కార్మికులకు జీవనాధారం అని, వాటిని కూల్చివేయడం వల్ల పలువురు కుటుంబాల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తాటి చెట్లను రక్షించాలని, గీత కార్మికుల జీవనోపాధిని కాపాడాలని నీళ్ల సురేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/demolition-of-palm-trees-in-kongarakalan/article-18745

Tags: