సంగెం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే

  విశ్వంభర,  వలిగొండ :  యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం–బోలేపల్లి గ్రామాల మధ్య మూసి నదిపై నిర్మించనున్న సంగెం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పనులు ప్రారంభించే ముందు భీమలింగం కట్ట వద్ద శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,  ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సంగెం, బోలేపల్లి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని కాలాల్లో సురక్షితమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ బ్రిడ్జికి రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  పరిపాలనా ఆమోదం తెలుపుతూ నిధులు మంజూరు చేశారని, రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రత్యేక చొరవతో పనులు ప్రారంభమయ్యేలా సహకరించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిర్మాణ పనులను ప్రారంభించామని ఎమ్మెల్యే వెల్లడించారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ  ఆర్&బి సరితారాణి, భువనగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bhuvanagiri-mla-who-started-the-construction-work-of-sangem-high/article-18807

Tags: