ఎస్‌ఐఆర్ సర్వేలో లోపాలపై టీడీపీ ఆందోళన
విశ్వంభర, ముషీరాబాదు : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో అనేక లోపాలు చోటుచేసుకుంటున్నాయని సికింద్రాబాద్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లెల్ల కిషోర్, పి. బాలరాజ్ గౌడ్ ఆరోపించారు. గురువారం హైదరాబాదు టీడీపీ నగర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇళ్లకు స్టిక్కర్లు వేస్తున్నారని, బీఎల్ఓల స్థానంలో ప్రైవేట్ వ్యక్తులతో సర్వే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లను సందర్శించకుండానే "డోర్ లాక్", "చిరునామా మారింది" అంటూ వివరాలు నమోదు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు, బీఎల్ఓలకు తగిన శిక్షణ లేకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు తక్షణమే సమీక్ష నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడైన ఓటరికి అవకాశం కల్పిస్తూ జూలై 24లోపు పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో: కాసుల సుదర్శన్ రెడ్డి తడక వినోద్ నేత శ్యామ్ సుందర్ కరణం కిరణ్ భాను ప్రకాష్ అనిల్ కురుమ పాల్గొన్నారు.