తుమ్మలగూడెంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగూడెం గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రామన్నపేట పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం, తుమ్మలగూడెం గ్రామానికి చెందిన చిన్న లచ్చి సాయిలు (69) తన టివి.ఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా చిట్యాల నుండి భువనగిరి వైపు వెళ్తున్న హెచ్.ఆర్ 38 డబ్లు 9712 నంబరు గల లారీ వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నలచ్చి సాయిలు రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, విధుల్లో ఉన్న వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య చిన్నలచ్చి నరసమ్మ ఫిర్యాదు మేరకు రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.