విద్య తోనే సమాజంలో గుర్తింపు: కావేటిగోవింద్ రాజ్
విశ్వంభర, గౌలి పుర : విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ కార్యవర్గ సభ్యులు, పాతనగర మున్నూరుకాపు సంఘం సలహాదారుడు కావేటి గోవిందరాజ్ పేర్కొన్నారు. గౌలిపుర లోని రోజరీ గ్రామర్ హైస్కూల్ పూర్వ విద్యార్థి దివంగత కావేటి ప్రణయ్ రాజ్ 19వ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కావేటి గోవింద్ రాజ్ మాట్లాడుతూ తన తనయుడు కావేటి ప్రణయ్ రాజ్ చదివిన పాఠశాలలో అతని జ్ఞాపకార్థం2007నుండి ప్రతిఏటా పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను40 మంది విద్యార్థినీ విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని, ఈ పాఠశాలలో చదివే విద్యార్థిలు నిరుపేదలైన ఇద్దరికీ మా సతీమణి స్కూలుకు ఫీజులు చెల్లిస్తుందని,. విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ మున్నూరు కాపు ప్రెసిడెంట్ ఆర్య దత్తు, వైస్ ప్రెసిడెంట్ పొన్న శ్రీనివాస్,, మున్నూరు రాష్ట్ర పెద్దలు కాశేట్టి ఆనంద్, అడ్వైజర్ డాక్టర్ ప్రసన్నకుమార్, సెక్రెటరీ అశ్విన్ కుమార్, తదితరులు పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.