మైనార్టీ సమస్యలు పరిష్కరించాలి: సయ్యద్ అజీజ్ పాషా
విశ్వంభర, ముషీరాబాదు : మైనార్టీల హక్కులను పరిరక్షించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, వక్ఫ్ భూములను కాపాడడంతో పాటు సంక్షేమ పథకాల్లో మైనార్టీలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆల్ ఇండియా తంజీమ్-ఎ-ఇన్సాఫ్ జాతీయాధ్యక్షుడు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. మైనార్టీల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన చలో సెక్రటేరియట్' కార్యక్రమంలో పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ, మైనార్టీ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, వక్ఫ్ భూముల ఆక్రమణలను అరికట్టాలని, జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో మైనార్టీ ఓట్ల తొలగింపుపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో: ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మునీర్ పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జమీల్, శంకర్ నాయక్, ఖాలీద్, కలీమ్, రెహమాన్, నదీమ్, ఖలీమ్, తన్వీర్ ఖాన్, హౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.