బెరువాడలో  న్యాయ విజ్ఞాన సదస్సు 

బెరువాడలో  న్యాయ విజ్ఞాన సదస్సు 

విశ్వంభర , కేసముద్రం: మహబూబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో  వివిధ వర్గాల వారికి  అందిసున్న ఉచిత న్యాయ సేవలను ప్రజలు అందరూ వినియోగిoచుకోవాలని  జిల్లా న్యాయ సేవధికార సంస్థ న్యాయవాదులు  చెన్న మల్లారెడ్డి, రాజ్ కృష్ణ పిలుపునిచ్చారు. గురువారం కేసముద్రం మండలం బేరువాడ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సు లో  న్యాయవదులు మాట్లాడుతూ మాట్లాడుతు.. చట్టం ముందర అందరూ సమానులేనని గొప్ప బీద అన్న తేడా లేదన్నారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయన్నారు. రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములకు సర్వే నంబర్లు, పహాణిలు సరిచేసుకోవాలని,  లేకపోతే   భూ భారతిలో దరఖాస్తు చేసూకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులలో చట్టపరమైన హక్కులు మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన లోపం వల్ల చాలా మంది నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యయసాయానికి పెట్టుబడిగా వ్యక్తుల దగ్గర మరియు ప్రైవేట్  సంస్థ ల దగ్గర తీసుకున్నటువంటి అధిక వడ్డీ ఋణ భారాల నుండి విముక్తి పొందుటకు ఋణ మార్పిడి అనే పథకం అమలులో ఉందన్నారు. రైతులు విత్తనాలు మరియు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు రసీదు తీసుకున్నప్పుడు మాత్రమే నకిలీ విత్తనాలు మరియు ఎరువులపై నష్టపరిహారం పొందే అవకాశం ఉందన్నారు. బాల్య వివాహాలు వంటి దురాచారాలకు పాల్పడి తమ పిల్లల జీవితాలను నాశనం చేయవద్దని న్యాయవాదులు హితువు  పలికారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను ఎవరైనా లైంగికంగా వేధించినట్లయితే వారు పోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు. ఎవరైనా న్యాయపరమైన సలహాలు సూచనలు కోసం టోల్ ఫ్రీ 15100 కు ఫోన్ చేసి న్యాయ సలహాలు పొందవచ్చు అన్నారు .  ఈ కార్యక్రమంలో  సర్పంచ్ ఈసం  లక్ష్మీనారాయణ,  కారోబార్ దేవయ్య,  అగ్రికల్చర్ ఆఫీసరు చరణ్  గ్రామ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jurisprudence-conference-at-beruwada/article-18799

Tags: