అంగన్వాడి హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతులు
- : 8మందికి నియామక పత్రాలు అందజేత
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన అంగన్వాడి హెల్పర్లకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పించారు. గౌరవ కలెక్టర్ నారాయణ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి, గౌరవ అడిషనల్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి చేతుల మీదుగా 8 మంది అంగన్వాడి ఆయాలకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జి. శాంతి శ్రీ, సిడిపిఓలు ఎల్. శాంతిరేఖ, ఎస్. రేణుక, పి. ఉదయ, పాల్గొని నూతనంగా పదోన్నతి పొందిన అంగన్వాడి టీచర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి జి. శాంతి శ్రీ మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాల్లో సేవలందిస్తున్న హెల్పర్ల కృషిని గుర్తించి ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తోంది. త్వరలో జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నాము అని తెలిపారు. నూతనంగా నియమితులైన టీచర్లు మరింత బాధ్యతతో పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయాలని అధికారులు కోరారు.