ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

విశ్వంభర, పెద్దపల్లి: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా సాగు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభావంపై వ్యవసాయ శాఖ నిర్వహించిన అంచనాల ప్రకారం 207 గ్రామాలు మోస్తరు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని, అయితే తీవ్ర ప్రభావం లేదా స్వల్ప ప్రభావం ఉన్న గ్రామాలు ఏవీ లేవని కలెక్టర్ తెలిపారు. జూలై 15 నాటికి జిల్లాలో మొత్తం 91,136 ఎకరాల్లో పంటల సాగు అంచనా వేయగా, ఇందులో 10,510 ఎకరాలు వర్షాధార పంటలు, 80,626 ఎకరాలు సాగునీటి ఆధారిత పంటలు ఉన్నాయని తెలిపారు. ఇంకా 1,84,671 ఎకరాల్లో సాగు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 16 నుంచి 31 వరకు జిల్లాలో 89,892 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో 84,500 ఎకరాల్లో వరి, 1,814 ఎకరాల్లో కందులు, 1,182 ఎకరాల్లో పెసల్లు, 186 ఎకరాల్లో మినుములు, 136 ఎకరాల్లో అలసందలు, 16 ఎకరాల్లో ఉలవలు, 8 ఎకరాల్లో ఆముదం, 925 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో పశుగ్రాస జొన్న, 471 ఎకరాల్లో కూరగాయలు, 651 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత సాగుకు అవసరమైన 17,259.03 క్వింటాళ్ల విత్తనాలకు గాను జిల్లాలో ఇప్పటికే 21,564.44 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులకు విత్తనాల కొరత తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ కాలంలో దిగుబడి వచ్చే ప్రత్యామ్నాయ పంటలు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటల సాగుపై సాంకేతిక సూచనలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, సాగు విధానాలను పాటిస్తూ సకాలంలో విత్తనాలు వేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఒక  ప్రకటనలో సూచించారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/district-collector-koya-sriharsha-said-that-el-ni%C3%B1o-should-be/article-18793

Tags: