నకిలీ ఓట్లను తొలగించాలి

నకిలీ ఓట్లను తొలగించాలి

  • ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు బీఆర్ఎస్వీ వినతిపత్రం

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్, తుర్కయంజాల్ మున్సిపాలిటీల ఓటర్ల జాబితాల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్వీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సంబంధిత వివరాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయా మున్సిపాలిటీల ఓటర్ల జాబితాల్లో పెద్ద సంఖ్యలో నకిలీ, డూప్లికేట్, నివాసేతర ఓటర్లు నమోదు అయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒకే ఇంటి నంబర్‌పై అసాధారణంగా అధిక సంఖ్యలో ఓటర్లు నమోదైన ఘటనలు గుర్తించినట్లు తెలిపారు. వాస్తవానికి ఆ చిరునామాల్లో నివసించని వ్యక్తుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో నమోదైనట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు నకిలీ లేదా కల్పిత నివాస ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించి, అనర్హులైన వ్యక్తులను ఓటర్లుగా నమోదు చేయించారని, కళాశాల విద్యార్థుల గుర్తింపు కార్డులను వినియోగించి ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించినట్లు తమకు సమాచారం అందిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ఆయన కోరారు. విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలితే, ఇటువంటి చర్యలు ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద అంబర్‌పేట్, తుర్కయంజాల్ మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల జాబితాలపై క్షేత్రస్థాయిలో ఇంటింటి తనిఖీలు నిర్వహించాలని, ఒకే ఇంటి నంబర్‌పై నమోదైన ఓటర్ల వివరాలను పూర్తిగా ధ్రువీకరించాలని వినతిపత్రంలో కోరారు. అలాగే నకిలీ, డూప్లికేట్, నివాసం మార్చిన, మరణించిన, ప్రవాస ఓటర్లను గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించే చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాలంటే ఓటర్ల జాబితాలు పూర్తిగా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండాల్సిన అవసరం ఉందని నిట్టు జగదీశ్వర్ పేర్కొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/fake-votes-should-be-removed/article-18717

Tags: