చెట్లే మానవ మనుగడకు జీవనాధారం
విశ్వంభర, సిద్దిపేట: చెట్లే మానవ మనుగడకు జీవనాధారమని సిద్దిపేట రూరల్ ఎస్ఐ నవత అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రూరల్ పోలీస్, గ్రామస్తుల సహకారంతో స్టేషన్ పరిధిలోని బండచెర్లపల్లి, బుస్సాపూర్, వెంకటాపూర్, బంజేరుపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఆయా సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో కలిసి గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నవత మాట్లాడుతూ మొక్కలు పెంచకపోతే భావితరాల భవిష్యత్ అంధకారం కాబోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామాల యువత వనజీవి రామయ్య స్ఫూర్తితో మొక్కలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్స్ శ్రీనివాస్, జ్యోతి, ఆయా గ్రామల ప్రజలు పాల్గొన్నారు.