ఓటరు నమోదులో అక్కన్నపేటకు విశేష స్పందన

ఓటరు నమోదులో అక్కన్నపేటకు విశేష స్పందన

విశ్వంభర, అక్కన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్‌  ఓటరు నమోదు కార్యక్రమం అక్కన్నపేట మండలంలో 90 శాతానికి పైగా విజయవంతంగా పూర్తికావడం పట్ల హుస్నాబాద్ డివిజన్ రైతు ఆత్మ చైర్మన్ జంగంపల్లి ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు, బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు, ఎన్నికల సిబ్బంది, గ్రామస్థాయి కార్యకర్తలు, సహకరించిన ప్రజలందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ అంకితభావంతో పనిచేసిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమన్నారు. రాష్ట్ర  మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని జంగంపల్లి ఐలయ్య పిలుపునిచ్చారు. అక్కన్నపేట మండలం రాష్ట్రంలోనే ఆదర్శ మండలంగా నిలవాలని ఆకాంక్షిస్తూ, ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు తెలిపారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/akannapet-received-a-special-response-in-voter-registration/article-18757

Tags: